సత్తా చాటిన స్వదేశీ టోర్పిడో

భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరబోతోంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టోర్పిడోను నేవీ మంగళవారం పరీక్షించింది.

Published : 07 Jun 2023 03:56 IST

దిల్లీ: భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరబోతోంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టోర్పిడోను నేవీ మంగళవారం పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నేవీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.  ‘‘నీటి అడుగున ఉండే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ, డీఆర్‌డీవో సాగిస్తున్న అన్వేషణలో ఇదో కీలక మైలురాయి. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన హెవీ వెయిట్‌ టోర్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశాం. మా పోరాట సంసిద్ధతకు ఇది నిదర్శనం’’ అని నౌకాదళం పేర్కొంది. అయితే ఈ టోర్పిడో పేరును గానీ, దాని సామర్థ్యం గురించి గానీ వెల్లడించలేదు. హిందూ మహాసముద్రంలో చైనా కారణంగా ముప్పు పెరుగుతున్న వేళ.. నేవీ ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.భారత నౌకాదళం వద్ద ఇప్పటికే వరుణాస్త్ర అనే భారీ టోర్పిడో ఉంది. 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగిస్తారు. ఈ అస్త్రాన్ని విశాఖపట్నంలోని నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌) అభివృద్ధి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని