మణిపుర్‌లో మళ్లీ హింస.. మిలిటెంట్ల కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి

మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ మిలిటెంట్లకు.. భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందగా ఇద్దరు అస్సాం రైఫిల్స్‌ జవాన్లకు గాయాలయ్యాయి.

Published : 07 Jun 2023 03:56 IST

ఇంపాల్‌: మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ మిలిటెంట్లకు.. భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందగా ఇద్దరు అస్సాం రైఫిల్స్‌ జవాన్లకు గాయాలయ్యాయి. కచింగ్‌ జిల్లా సెరో ప్రాంతంలోని పాఠశాలలో మంగళవారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ రంజిత్‌ యాదవ్‌ కుకీ మిలిటెంట్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను కచింగ్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.  మిలిటెంట్ల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఫయెంగ్‌లోనూ భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య కాల్పులు జరిగాయని పేర్కొంది. మరోవైపు ఆదివారం రాత్రి సుగ్నులో ఖాళీ చేసిన పునరావాస శిబిరాన్ని గ్రామస్థులు తగులబెట్టారు. సెరోలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంటితోపాటు 100 ఇళ్లకు కుకీ మిలిటెంట్లు నిప్పంటించడంతో ఆగ్రహంతో గ్రామస్థులు ఈ పని చేశారు. ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతను ఈ నెల 10 సాయంత్రం 3 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతపై ఇద్దరు మణిపుర్‌ వాసులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు