అజ్‌మేర్ రైల్లో షార్ట్‌సర్క్యూట్.. ప్రయాణికులు సురక్షితం
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సమీప సియాల్దా నుంచి అజ్‌మేర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది.
కౌశాంబీ (యూపీ): పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సమీప సియాల్దా నుంచి అజ్‌మేర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. వెనకవైపు నుంచి మూడోపెట్టెలో మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో మంటల్ని గుర్తించారు. ప్రయాణికులు చెయిన్‌లాగి రైలును ఆపి ఉరుకులుపరుగులపై కిందికి దిగిపోయారు. కొందరైతే అత్యవసర కిటికీల నుంచి బయటకు దూకారు. అరగంటలోపే మంటల్ని అదుపుచేశారు. తర్వాత ఈ రైలు బయల్దేరి వెళ్లింది. ప్రయాణికులంతా సురక్షితమేనని రైల్వే వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’