క్రికెట్‌ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్‌

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో ముంబయి పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు.

Published : 07 Jun 2023 03:56 IST

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో ముంబయి పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన క్రికెట్‌ బుకీ అనిల్‌ జైసింఘానీని అమృతా సాయంతోనే అరెస్టు చేసినట్లు పోలీసులు అందులో పేర్కొన్నారు. నిందితులైన  తండ్రీకూతుళ్లు అనిల్‌ జైసింఘానీ, అనిక్షలపై ఈ ఏడాది ఫిబ్రవరి 20న పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే 15 కేసుల్లో నిందితుడైన జైసింఘానీ.. ఏడెనిమిదేళ్లుగా పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి అరెస్టుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులు.. అనిల్‌ లొకేషన్‌ను గుర్తించేందుకు అమృతా ఫడణవీస్‌ సాయం కోరారు. పోలీసుల సూచన మేరకు ఆమె అనిల్‌కు ఓ సందేశం పంపారు. ‘‘మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికిస్తే దాని గురించి నేను దేవేంద్ర ఫడణవీస్‌తో మాట్లాడతాను’’ అని ఆశ పెట్టారు. దీంతో అనిల్‌ ఆమెకు కొన్ని డాక్యుమెంట్లు, ఆడియో మెసేజ్‌లు పంపించాడు. నిందితుడి లొకేషన్‌ను ఇట్టే పసిగట్టిన పోలీసులు మార్చి 16న అనిక్షను, 19న అనిల్‌ జైసింఘానీని అరెస్టు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని