అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రముప్పు

త్వరలో జరగనున్న వార్షిక అమరనాథ్‌ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ యాత్రను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని పాకిస్థాన్‌ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

Published : 07 Jun 2023 04:15 IST

దాడి చేసేందుకు పాక్‌ ముష్కరుల కుట్ర?

దిల్లీ: త్వరలో జరగనున్న వార్షిక అమరనాథ్‌ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ యాత్రను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని పాకిస్థాన్‌ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అమర్‌నాథ్‌ యాత్ర కాన్వాయ్‌, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఇద్దరు కశ్మీరీ యువకులకు దాడి బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. రాజౌరీ-పూంఛ్‌, పిర్‌ పంజాల్‌, చీనాబ్‌ లోయ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగొచ్చని సదరు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, దాడులకు పాల్పడతారని అనుమానిస్తున్న ఆ ఇద్దరు యువకుల ఆచూకీ కోసం భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. జులై ఒకటో తేదీ నుంచి భక్తులు యాత్రను ప్రారంభించనుండడంతో జాతీయ విపత్తు స్పందన దళాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కూడా ఏర్పాట్లలో మునిగిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని