దేశవ్యాప్తంగా 2వేల ప్యాక్స్‌లో జన్ ఔషధి కేంద్రాలు
దేశవ్యాప్తంగా రెండు వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్)లో ‘ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి’ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా రెండు వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్)లో ‘ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి’ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అర్హమైన ప్యాక్స్‌ని గుర్తించి వాటిలో వెయ్యి కేంద్రాలు ఆగస్టు నాటికి, మరో వెయ్యి కేంద్రాలు డిసెంబర్ నాటికి ప్రారంభించాలని తీర్మానించింది. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌షా, ఎరువులు-రసాయనాలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఇందుకు ఆమోద ముద్ర వేశారు. దీనివల్ల ప్యాక్స్ ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చౌకధరల్లో ఔషధాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహకారశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,400కిపైగా జన్‌ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,800 రకాల మందులు, 285 వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. బహిరంగ మార్కెట్‌లోని బ్రాండ్ ఔషధాలతో పోలిస్తే ఇందులో 50% నుంచి 90% తక్కువ ధరల్లోనే మందులు దొరుకుతాయి. డి.ఫార్మా, బి.ఫార్మా పట్టా ఉన్నవారు ఈ దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పట్టా ఉన్నవారిని నియమించుకొని స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, ఆసుపత్రులు ఈ దుకాణాల ఏర్పాటుకు అనుమతి కోరవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్
-
2 Year Old Girl: రాత్రి సమయంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి.. చివరకు..!
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
Congress-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్: చాడ వెంకట్‌రెడ్డి