వందేళ్లయినా పదిలంగా దాచారు

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన దేశాయ్‌ కుటుంబం వందేళ్ల క్రితం తయారుచేసిన బైక్‌లను ఇప్పటికీ నడుపుతూ జాగ్రత్తగా కాపాడుకుంటోంది.

Published : 08 Jun 2023 03:57 IST

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన దేశాయ్‌ కుటుంబం వందేళ్ల క్రితం తయారుచేసిన బైక్‌లను ఇప్పటికీ నడుపుతూ జాగ్రత్తగా కాపాడుకుంటోంది. వీరి ఇంటి ఆవరణలో వింటేజ్‌ మ్యూజియంలా ఉన్న ద్విచక్ర వాహనాల్లో 123 ఏళ్ల కిందటి బైక్‌ సైతం ఉంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, లాంబ్రెటా, యెజ్డీ, జావా వంటి ప్రముఖ బైక్‌ మోడళ్లను సేకరించిన దేశాయ్‌ కుటుంబం 45 బైక్‌లను ప్రదర్శనలా ఉంచింది. వ్యవసాయం ప్రధానవృత్తి అయిన ఈ కుటుంబపెద్ద కృపలానీ దేశాయ్‌కు ద్విచక్ర వాహనాలంటే మక్కువ. 1990 నుంచి బైక్‌ల సేకరణ ప్రారంభించారు. పుణె, నాసిక్‌, రాజస్థాన్‌, హైదరాబాద్‌, బరోడా సహా గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కొన్ని బైక్‌లను సేకరించారు. ప్రస్తుతం ఈ బైక్‌ల నిర్వహణ కృపలానీ కుమారుడు సిద్ధార్థ్‌ దేశాయ్‌ చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని