ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
శబరి గిరీశుడు అయ్యప్పకు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కానుకలు పంపేలా ఈ-కానిక వెబ్‌సైట్‌ను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రారంభించింది.
శబరి గిరీశుడు అయ్యప్పకు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కానుకలు పంపేలా ఈ-కానిక వెబ్‌సైట్‌ను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రారంభించింది. దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. బుధవారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆలయబోర్డు అధ్యక్షుడు అనంత గోపాలన్‌కు మొదటి కానుకను ఆ సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ సమర్పించారు. ఈ-కానిక ద్వారా అయ్యప్పస్వామి గుడికి వచ్చే ఆదాయం పెరుగుతుందని ఆలయ బోర్డు భావిస్తోంది. శబరిమల క్షేత్రాన్ని జూన్ 15న తెరవనుండగా ఆ తర్వాత నుంచి నాలుగు రోజులు స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శబరిమల బోర్డు గతంలో భక్తుల కోసం వర్చువల్ క్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ వర్చువల్ క్యూ బుకింగుకు సంబంధించిన వెబ్‌సైట్ పనులను కూడా టీసీఎస్‌కు బోర్డు అప్పగించింది. వచ్చే నెలలోగా ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ క్షేత్రానికి 2022లో భారీగా రూ.330 కోట్ల వార్షికాదాయం సమకూరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం
-
Flipkart: ‘బిగ్ బిలియన్ డేస్’ యాడ్.. ఫ్లిప్‌కార్ట్, అమితాబ్‌పై కాయిట్ ఫిర్యాదు
-
Bandi Sanjay: ప్రధాని మోదీ వాస్తవాలు చెబితే ఉలుకెందుకు?: బండి సంజయ్
-
Hyderabad: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి బలవన్మరణం