సిసోదియాను మిస్‌ అవుతున్నా.. కన్నీరు పెట్టుకున్న కేజ్రీవాల్‌

జైల్లో ఉన్న ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియాను తలచుకుని కేజ్రీవాల్‌ ఉద్విగ్నభరితులయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

Published : 08 Jun 2023 06:40 IST

దిల్లీ: జైల్లో ఉన్న ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియాను తలచుకుని కేజ్రీవాల్‌ ఉద్విగ్నభరితులయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. దిల్లీలో కొత్త పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. బుధవారం బవానా ప్రాంతంలో బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎక్స్‌లెన్స్‌ కొత్త విభాగాన్ని కేజ్రీవాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మనీశ్‌ను ఎంతో మిస్‌ అవుతున్నా. ఆయన దీనిని మొదలుపెట్టారు. ప్రతి విద్యార్థి మెరుగైన విద్య పొందాలనేది ఆయన కల. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ మంచి విద్యను అందిస్తున్నందుకు ఆయనను జైలు పాలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసి, తప్పుడు కేసు పెట్టి మంచి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఎంతో మంది దొంగలు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆయన త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని నేను నమ్ముతున్నా’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని