రష్యాకు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం

దేశరాజధాని దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరి రష్యాలో చిక్కుకుపోయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే యత్నాలు మొదలయ్యాయి.

Published : 08 Jun 2023 04:56 IST

మగదన్‌లో చిక్కుకున్న ప్రయాణికులను శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించే యత్నం

దిల్లీ: దేశరాజధాని దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరి రష్యాలో చిక్కుకుపోయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే యత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రష్యాలో మగదన్‌ విమానాశ్రయంలో అవస్థలు పడుతున్న 216 మంది ప్రయాణికులను అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించేందుకు ముంబయి నుంచి ప్రత్యేక విమానం బయలుదేరిందని, అది గురువారం ఉదయం రష్యాకు చేరుకుంటుందని ఎయిరిండియా తెలిపింది. ‘బుధవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఎయిరిండియా ప్రత్యేక విమానం ముంబయి నుంచి మగదన్‌కు బయలుదేరింది. అది 8న అక్కడి నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరుతుంది’ అని ఎయిరిండియా తాజా ప్రకటనలో వెల్లడించింది. దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు మంగళవారం బయలుదేరిన ఎయిరిండియా విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. అనంతరం దాన్ని వెంటనే రష్యా వైపు మళ్లించారు. అది రష్యాలోని మగదన్‌ విమానాశ్రయంలో సురక్షితంగా దిగిన సంగతి తెలిసిందే.

విమానంలో అమెరికా పౌరులు?

ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లేందుకు వీలుగా మరో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతి ఇచ్చినట్లు రష్యా విమానయాన సంస్థ తెలిపింది. రష్యాలో ఎయిరిండియా విమానం దిగడాన్ని తాము గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. విమానంలో అమెరికా పౌరులు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు