మరుగుజ్జుల మళ్లీపెళ్లి

బిహార్‌కు చెందిన ఇద్దరు మరుగుజ్జు దంపతులు మళ్లీపెళ్లి చేసుకున్నారు. ఏడు నెలల క్రితం గుడిలో కులాంతర వివాహం చేసుకున్న వీరు.. రెండోసారి రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో చట్టపరంగా ఒక్కటయ్యారు.

Published : 08 Jun 2023 04:56 IST

ఈటీవీ భారత్‌: బిహార్‌కు చెందిన ఇద్దరు మరుగుజ్జు దంపతులు మళ్లీపెళ్లి చేసుకున్నారు. ఏడు నెలల క్రితం గుడిలో కులాంతర వివాహం చేసుకున్న వీరు.. రెండోసారి రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో చట్టపరంగా ఒక్కటయ్యారు. బిహార్‌లోని సీతామఢీ జిల్లాకు చెందిన యోగేంద్ర (25), పూజ (21)ల జంట కేంద్ర ప్రభుత్వ సాయం కోసమే తాము మళ్లీపెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. దుమ్రా బ్లాక్‌లోని రాంపుర్‌ పరోరి గ్రామానికి చెందిన యోగేంద్ర ఎత్తు 3 అడుగులు. సీతామఢీలోని లోహియా నగర్‌కు చెందిన పూజ ఎత్తు 3.5 అడుగులు. 2022 నవంబరులో వీరి పెళ్లి జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న వీరికి రూ.2.5 లక్షల కేంద్ర ప్రభుత్వ ఆర్థికసాయం అందుతుంది. దీంతోపాటు దివ్యాంగుల సాయం కింద మరో రూ.లక్ష సైతం అందుతాయి. ఈ సాయం పొందాలంటే పెళ్లికి చట్టబద్ధత ఉండాలని అధికారులు చెప్పడంతో యోగేంద్ర, పూజ మరోసారి ఒక్కటయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు