అలనాటి దూరదర్శన్‌ యాంకర్‌ గీతాంజలి అయ్యర్‌ కన్నుమూత

భారత్‌లో తొలితరం మహిళా ఆంగ్ల న్యూస్‌ ప్రజెంటర్లలో ఒకరైన గీతాంజలి అయ్యర్‌   (76) కన్నుమూశారు. ఆమె.. కొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు.

Published : 08 Jun 2023 04:56 IST

దిల్లీ: భారత్‌లో తొలితరం మహిళా ఆంగ్ల న్యూస్‌ ప్రజెంటర్లలో ఒకరైన గీతాంజలి అయ్యర్‌   (76) కన్నుమూశారు. ఆమె.. కొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. బుధవారం ఒక్కసారిగా కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. గీతాంజలి కోల్‌కతాలోని లొరెటో కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 1971లో దూరదర్శన్‌లో చేరారు. నాలుగుసార్లు ఉత్తమ యాంకర్‌ అవార్డు అందుకున్నారు. 1989లో ‘ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డ్‌ ఫర్‌ ఔట్‌స్టాండింగ్‌ ఉమెన్‌’ను కూడా దక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని