శరవేగంగా భారత్‌ అభివృద్ధి

భారత దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ దశాబ్ది చివరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.

Published : 08 Jun 2023 05:12 IST

దశాబ్ది చివరకు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
బెల్‌గ్రేడ్‌లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం

బెల్‌గ్రేడ్‌: భారత దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ దశాబ్ది చివరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో బుధవారం ఆమె ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. భారతదేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని, 2047కు అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చోటు దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలీనోద్యమ కాలం నుంచి సెర్బియా, భారత్‌ల మధ్య సత్సంబంధాలు వేళ్లూనుకున్నాయని తెలిపారు. పలు క్రీడల్లో భారతీయ ఆటగాళ్ల నైపుణ్యాలను పెంచేలా సెర్బియా కోచ్‌లు శిక్షణ ఇస్తున్నారని గుర్తు చేశారు. సురినాంలో మూడు రోజుల పర్యటన అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సెర్బియా చేరుకున్నారు. బెల్‌గ్రేడ్‌ విమానాశ్రయంలో సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్‌ వూచిచ్‌ ఆమెకు స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి సెర్బియాను సందర్శించడం ఇదే తొలిసారి. బెల్‌గ్రేడ్‌లో జాతిపిత మహాత్మా గాంధీజీ ప్రతిమకు ముర్ము పుష్పాంజలి ఘటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని