జైల్లో భర్తను చూసి.. గుండెపోటుతో కుప్పకూలిన గర్భిణి

హత్యాయత్నం కేసులో జైల్లో ఉన్న భర్తను కలవడానికి వెళ్లిన ఓ గర్భిణి గుండెపోటుతో మృతి చెందింది.

Updated : 09 Jun 2023 10:42 IST

బిహార్‌: హత్యాయత్నం కేసులో జైల్లో ఉన్న భర్తను కలవడానికి వెళ్లిన ఓ గర్భిణి గుండెపోటుతో మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో జరిగింది. పల్లవి, గోవింద్‌ యాదవ్‌లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. గోవింద్‌ హత్యాయత్నం కేసులో ఏడు నెలల నుంచి జైల్లో ఉన్నాడు. దీంతో పల్లవి మనస్తాపానికి గురైంది. ప్రసవానికి ముందు భర్తను కలవాలనుకుని మంగళవారం  జైలుకు వెళ్లింది. కాసేపు భర్తతో కష్టసుఖాలు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఒక్కసారిగా కూలబడింది. ఇది గమనించిన అక్కడి సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు