క్రెడిట్ల ఆధారంగా డిగ్రీలు, డిప్లొమాలు

విద్యార్థులు నిర్ణీత క్రెడిట్లు సాధిస్తే ఆయా కోర్సుల కనిష్ఠ కాలవ్యవధితో సంబంధం లేకుండా డిప్లొమా లేదా డిగ్రీ ధ్రువపత్రాలు  పొందేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్యానెల్‌ ప్రతిపాదనలు రూపొందించింది.

Published : 09 Jun 2023 03:55 IST

యూజీసీ ప్యానెల్‌ సిఫార్సు

దిల్లీ: విద్యార్థులు నిర్ణీత క్రెడిట్లు సాధిస్తే ఆయా కోర్సుల కనిష్ఠ కాలవ్యవధితో సంబంధం లేకుండా డిప్లొమా లేదా డిగ్రీ ధ్రువపత్రాలు  పొందేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్యానెల్‌ ప్రతిపాదనలు రూపొందించింది. నిర్ణీత క్రెడిట్లు సాధించాక ధ్రువపత్రాలు పొందడానికి అర్హుడిగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సులకు నామకరణం చేయాలని ప్యానెల్‌ సిఫార్సు చేసింది. సమకాలీన, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నామకరణాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ప్యానెల్‌ కమిటీ సభ్యులు యూజీసీకి ప్రతిపాదనలు సమర్పించారు. కమిషన్‌ ఆమోదం పొందిన తరవాత కొత్త విధివిధానాలను యూజీసీ ప్రకటించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని