అప్రమత్తంగా ఉండేలా కౌన్సెలింగ్‌ ఇవ్వండి

విధి నిర్వహణలో రైల్వే కంట్రోలర్లు, రైళ్ల మేనేజర్లు అప్రమత్తంగా ఉండేలా వెంటనే తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలని రైల్వే మంత్రిత్వశాఖ గురువారం అన్ని డివిజన్లకు సూచించింది.

Published : 09 Jun 2023 03:55 IST

డివిజన్లకు రైల్వే శాఖ సూచన

దిల్లీ: విధి నిర్వహణలో రైల్వే కంట్రోలర్లు, రైళ్ల మేనేజర్లు అప్రమత్తంగా ఉండేలా వెంటనే తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలని రైల్వే మంత్రిత్వశాఖ గురువారం అన్ని డివిజన్లకు సూచించింది. రైళ్ల రాకపోకలు సజావుగా, సురక్షితంగా జరిగేలా దీనిని చేపట్టాలంది. ఈ నెల 2న ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్లకు రైల్వేబోర్డు సూచనలు జారీచేసింది. కొన్ని జోన్లలో ఈ వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉంది. స్టేషన్‌ మాస్టర్లు, పాయింట్స్‌మేన్‌కు అన్ని జోన్లలో ఇది అమలవుతోంది. బాగా అవగాహన ఉన్న రైలు మేనేజర్లను, సెక్షన్‌ కంట్రోలర్లను ఉపయోగించుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించడాన్ని అత్యవసరంగా గుర్తించాలని బోర్డు తెలిపింది. సాధారణ, అసాధారణ పరిస్థితుల్లో ఎంతటి అప్రమత్తతతో ఎలా వ్యవహరించాలో మరోసారి గుర్తు చేయడమే ఈ కసరత్తు ఉద్దేశమంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు