భారత విద్యావ్యవస్థను నాశనం చేసిన బ్రిటిష్ వారు
ఘనమైన భారతీయ విద్యా వ్యవస్థను బ్రిటిష్ వారు నాశనం చేశారని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. వారు ప్రవేశ పెట్టిన విద్యా విధానం గుమస్తాల తయారీ వ్యవస్థలా మారిందన్నారు.
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణ
గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ జాతికి అంకితం
దిల్లీ: ఘనమైన భారతీయ విద్యా వ్యవస్థను బ్రిటిష్ వారు నాశనం చేశారని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. వారు ప్రవేశ పెట్టిన విద్యా విధానం గుమస్తాల తయారీ వ్యవస్థలా మారిందన్నారు. ఇప్పటి విద్యార్థులు పలువురికి ఉద్యోగాలు ఇచ్చేవారిగా శిక్షణ పొందాలి తప్ప ఉపాధి కోసం ఎదురు చూసేవారుగా ఉండరాదని పిలుపునిచ్చారు. తూర్పు దిల్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన గురు గోవింద్‌సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్సిటీని ఆయన జాతికి అంకితం చేశారు. సభలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా కొందరు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపి, తాను చెప్పేది ఓపికతో వినాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఇదే కార్యక్రమానికి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కూడా హజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.