గాడ్సే భరతమాత సుపుత్రుడు

నాథూరామ్‌ గాడ్సేను భరతమాత సుపుత్రునిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అభివర్ణించారు.

Published : 10 Jun 2023 04:13 IST

కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌

దంతెవాడ: నాథూరామ్‌ గాడ్సేను భరతమాత సుపుత్రునిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అభివర్ణించారు. మహాత్ముడి హంతకుడు మొగల్‌ పాలకులైన బాబర్‌, ఔరంగజేబుల్లా ఆక్రమణదారు కాదని.. ఈ గడ్డపై పుట్టినవాడని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబర్‌, ఔరంగజేబుల వారసుల్లా భావించేవారు భరతమాతకు నిజమైన పుత్రులు కారన్నారు. గాడ్సేపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఔరంగజేబుపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ అతడు (గాడ్సే) గాంధీ హంతకుడైతే, అతడు భరతమాత సుపుత్రుడు కూడా’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని