శరద్‌పవార్‌ను చంపేస్తాం
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను చంపేస్తామంటూ వాట్సప్‌లో బెదిరింపులు వచ్చాయని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు.
వాట్సప్‌లో బెదిరింపులు
రౌత్ సోదరులకూ ఫోన్‌కాల్స్
ముంబయి: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను చంపేస్తామంటూ వాట్సప్‌లో బెదిరింపులు వచ్చాయని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. శుక్రవారం ఆమె ముంబయి పోలీస్ చీఫ్ వివేక్ ఫన్సల్కర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ‘నీకూ నరేంద్ర దభోల్కర్ గతే పడుతుంది’ అని బెదిరిస్తూ ఆగంతకులు పంపిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను పోలీసు కమిషనర్‌కు ఆమె అందజేశారు. దభోల్కర్ మూఢనమ్మకాల నిర్మూలనకు పోరాడిన సామాజిక కార్యకర్త. 2013 ఆగస్టు 20న ఇద్దరు ఆగంతుకులు బైక్‌పై వచ్చి ఆయన్ను కాల్చి చంపారు. ఎన్సీపీ అధినేతకు వచ్చిన బెదిరింపుపై సీఎం ఏక్‌నాథ్‌శిందే విచారణకు ఆదేశించారు. మరోవైపు తనకు, తన సోదరుడు ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు కూడా బెదిరింపులొచ్చాయని శివసేన ఉద్ధవ్‌ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్‌రౌత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?