పెళ్లిలో రక్తదానం.. అవయవదాన ప్రమాణం

ఛత్తీస్‌గఢ్‌లోని చారిత్రక గ్రామం కండెల్‌లో ఆదర్శ వివాహం జరిగింది. ఈ పెళ్లిలో వధూవరులతోపాటు వచ్చిన బంధుమిత్రులు అందరూ రక్తదానం, అవయవదానం చేస్తామంటూ ప్రమాణం చేయటం విశేషం.

Published : 10 Jun 2023 04:13 IST

ఛత్తీస్‌గఢ్‌లోని చారిత్రక గ్రామం కండెల్‌లో ఆదర్శ వివాహం జరిగింది. ఈ పెళ్లిలో వధూవరులతోపాటు వచ్చిన బంధుమిత్రులు అందరూ రక్తదానం, అవయవదానం చేస్తామంటూ ప్రమాణం చేయటం విశేషం. మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేసిన నేల ఇది. గురువారం ఇక్కడ జరిగిన వివాహంలో వధూవరుల బంధువులు 20 మంది రక్తదానం చేశారు. ఈ స్ఫూర్తితో పలువురు ముందుకువచ్చి నేత్రదానం చేస్తామని ప్రకటించారు. ఏడుగురు వ్యక్తులు అవయవ దానానికి తమ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా వరుడు ముకేశ్‌ సాహు మాట్లాడుతూ.. ‘‘అవసరంలో ఉన్న ఇతర వ్యక్తుల జీవితాలను కాపాడేందుకు రక్తదానం, అవయవదానం చేసేలా ప్రజలు ముందుకురావాలన్న స్ఫూర్తిని చాటడమే మా ఉద్దేశం’’ అన్నారు. పెళ్లి శుభలేఖలో సైతం తాము ఈ విషయాన్ని ప్రచురించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని