Exams: 35% మార్కులైతేనేం.. పాసయ్యామా.. లేదా!
పరీక్షల్లో ఉత్తీర్ణులైనా మార్కులు తగ్గాయని ఆత్మహత్యలు చేసుకొంటున్న విద్యార్థులను చూశాం.
పరీక్షల్లో ఉత్తీర్ణులైనా మార్కులు తగ్గాయని ఆత్మహత్యలు చేసుకొంటున్న విద్యార్థులను చూశాం. కొంతమంది తల్లిదండ్రుల ఒత్తిడి కూడా పిల్లలపై ఆ స్థాయిలో ఉంటోంది. ఇందుకు భిన్నంగా.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ఠాణె విద్యార్థి 35 శాతం కనీస మార్కులతో పాసవగా.. ఓ ఆటోడ్రైవర్ (తండ్రి) కుటుంబం సంబరాలు చేసుకొంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్.. ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. కేవలం మార్కుల ద్వారా ఒకరి ప్రతిభను అంచనా వేయలేమని ఆయన పేర్కొన్నారు. తనకు 10వ తరగతిలో 44.7 శాతం మార్కులే వచ్చాయని.. డిగ్రీ తర్వాత సివిల్స్ రెండో ప్రయత్నంలో ఆలిండియా 77వ ర్యాంకు సాధించినట్లు గుర్తు చేసుకున్నారు. విద్యార్థి తల్లిదండ్రుల సానుకూల దృక్పథాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.