రూ.2వేల నోట్ల మార్పిడిపై.. అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
ఎలాంటి విజ్ఞప్తి రశీదు, ధ్రువపత్రం లేకుండానే రూ.2వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పించేలా ఆర్బీఐ జారీచేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
దిల్లీ: ఎలాంటి విజ్ఞప్తి రశీదు, ధ్రువపత్రం లేకుండానే రూ.2వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పించేలా ఆర్బీఐ జారీచేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందల్‌తో కూడిన వెకేషన్ బెంచ్.. రిజిస్ట్రీ దాఖలు చేసిన నివేదికను పరిశీలించి, ఇందులో అత్యవసరమేమీ లేదని పేర్కొంది. వేసవి సెలవుల అనంతరం ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ అంశంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించడం ఇది రెండోసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.