మణిపుర్‌లో శాంతి స్థాపనకు కమిటీ

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో శాంతి స్థాపన దిశగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. గవర్నర్‌ నేతృత్వంలో శాంతి కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది.

Published : 11 Jun 2023 04:50 IST

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

దిల్లీ, ఇంఫాల్‌: హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో శాంతి స్థాపన దిశగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. గవర్నర్‌ నేతృత్వంలో శాంతి కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నేతలను సభ్యులుగా నియమించింది. ఇంకా కమిటీలో మాజీ బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, వివిధ జాతుల నేతలు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. జాతుల మధ్య శాంతి స్థాపన ప్రక్రియను సులభతరం చేసేందుకు, వారి మధ్య చర్చల నిర్వహణకు ఈ కమిటీ చొరవ తీసుకుంటుందని శనివారం ఒక ప్రకటనలో కేంద్ర హోంశాఖ తెలిపింది. కేంద్ర మంత్రి అమిత్‌ షా ఇటీవల మణిపుర్‌లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదలైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని