Mangoes: కిలో మామిడి పండ్లు @ రూ.2.75 లక్షలు!

ప్రస్తుతం మార్కెట్‌లో కిలో మామిడి పండ్ల ధర ఎంతుంటుంది? రకాన్ని బట్టి మహా అయితే రూ.50 నుంచి రూ.400 వరకు ఉండొచ్చు.

Updated : 11 Jun 2023 16:23 IST

ప్రస్తుతం మార్కెట్‌లో కిలో మామిడి పండ్ల ధర ఎంతుంటుంది? రకాన్ని బట్టి మహా అయితే రూ.50 నుంచి రూ.400 వరకు ఉండొచ్చు. అదే కిలో మామిడి పండ్ల ధర రూ.2.75 లక్షలు ఉంటే? అలాంటివి మన దేశంలో ఉంటాయా? అనేగా మీ సందేహం!! పశ్చిమబెంగాల్లో తాజాగా విక్రయానికి వచ్చిన ఈ మామిడి పండ్లు మీ సందేహానికి సమాధానమిస్తాయి. ఆ రాష్ట్రంలోని సిలిగుడి జిల్లా మటిగరా మాల్‌లో ప్రస్తుతం మామిడి పళ్ల ఉత్సవం జరుగుతోంది. ఇక్కడకు మొత్తం 262 రకాల మామిడి పండ్లు ప్రదర్శనకు వచ్చాయి. వాటిలో మియాజాకి రకం మామిడిని చూసేందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి ధర కిలో రూ.2.75 లక్షలు కావడమే అందుకు కారణం. మియాజాకి రకం మామిడిని భారత్‌ సహా పలు ఆసియా దేశాల్లో సాగుచేస్తారు. ముందుగా జపాన్‌లోని మియాజాకి నగరంలో.. ఈ రకం మామిడి చెట్లు బయటపడ్డాయి. పరిమాణంలో సాధారణ మామిడి పండ్ల కంటే పెద్దగా ఉంటాయి. ఒక్కో పండు.. 350 గ్రాముల నుంచి 900 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. ఇతర రకాలతో పోలిస్తే.. వీటిలో తీపి 15% ఎక్కువ.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు