JP Nadda: జేపీ నడ్డాపై కేసు కొట్టివేత

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు వివరాలు ఆదివారం బయటకొచ్చాయి.

Updated : 21 Aug 2023 09:17 IST

అధికారుల నిర్లక్ష్యం కనపడుతోందన్న కర్ణాటక హైకోర్టు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు వివరాలు ఆదివారం బయటకొచ్చాయి. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో.. ‘భాజపా మరోసారి అధికారంలోకి రాకపోతే, ఇప్పటివరకు అందుకుంటున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి’ అని ఓటర్లను బెదిరించినట్లు మాట్లాడారని నడ్డాపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ కేసుకి సంబంధించి స్థానిక మేజిస్ట్రేట్ అనుమతి ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిర్ణయాన్ని నడ్డా హైకోర్టులో సవాలు చేయగా తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొనడానికి బదులుగా నేరానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారని పోలీసులను ఆక్షేపించింది. దీనిని అధికారుల నిర్లక్ష్యంగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో నిందితునిపై క్రిమినల్‌ చర్యలకు అనుమతిస్తే అది చట్టవిరుద్ధమే అవుతుందని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని