ఆగ్రాలో డ్రైవర్‌ లేకుండా పరుగుతీసిన కంటెయినర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటెయినర్‌ ట్రక్కు డ్రైవరు లేకుండానే రోడ్డుపై పరుగులు పెట్టింది. ట్రాన్స్‌ యమునా పోలీస్‌స్టేషను పరిధిలోని టెఢీ బగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

Updated : 21 Sep 2023 06:55 IST

త్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటెయినర్‌ ట్రక్కు డ్రైవరు లేకుండానే రోడ్డుపై పరుగులు పెట్టింది. ట్రాన్స్‌ యమునా పోలీస్‌స్టేషను పరిధిలోని టెఢీ బగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పని మీద కిందకు దిగిన ట్రక్కు డ్రైవరు హ్యాండ్‌బ్రేక్‌ వేయడం మరచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు లేకుండా రోడ్డుపై కదులుతున్న లారీని చూసిన జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ట్రక్కు ఢీకొని రోడ్డు పక్కన ఉంచిన రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసమవగా.. కొంతమంది ద్విచక్ర వాహనదారులతోపాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. చిన్నారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని