ఏమిటీ డీలిమిటేషన్?
మహిళా రిజర్వేషన్ల బిల్లుతోపాటు వినిపిస్తున్న పదం.. డీలిమిటేషన్. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ల బిల్లు ఆమోదం సులభమైనా దాని అమలు డీలిమిటేషన్‌తో ముడిపడింది.
మహిళా రిజర్వేషన్ల బిల్లుతో చర్చనీయాంశం
మహిళా రిజర్వేషన్ల బిల్లుతోపాటు వినిపిస్తున్న పదం.. డీలిమిటేషన్. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ల బిల్లు ఆమోదం సులభమైనా దాని అమలు డీలిమిటేషన్‌తో ముడిపడింది. ఇంతకూ ఏమిటీ ప్రక్రియ? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు?
జనాభా ప్రాతిపదికన..
దేశంలో, రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియే డీలిమిటేషన్. సులభంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియ. అంటే మారుతుండే జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఇది.
వారి మాటే శాసనం
డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం. రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం దీనిని చేపడతారు. ప్రతి పదేళ్లకోసారి జరిగే జనగణన తర్వాత ఇది జరగాలి. డీలిమిటేషన్ చట్టం ప్రకారం... కేంద్ర ప్రభుత్వం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యం వహిస్తారు. ఇది తాత్కాలిక కమిషన్ కాబట్టి శాశ్వత ఉద్యోగులంటూ ఇందులో ఉండరు. ఎన్నికల కమిషన్ సిబ్బందినే వినియోగించుకుంటారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల జనాభా గణాంకాలను సేకరించి, అధ్యయనం చేసి ఈ కమిషన్ తన ప్రాథమిక నివేదికను సమర్పిస్తుంది. ఇందుకు కనీసం ఐదేళ్ల సమయం పట్టే అవకాశముంది. దీన్ని గెజిట్‌లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటినీ పరిశీలించాక తుది నివేదిక ఇస్తారు. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ తుది నివేదిక ప్రచురించిందంటే దానిని పార్లమెంటు కూడా మార్చలేదు. ఏ కోర్టులోనూ సవాలు చేయడానికి లేదు. డీలిమిటేషన్ కమిషన్ ఏది చెబితే అది చట్టం అవుతుందంతే.
1973లో ఆగిపోయింది
మొదటి డీలిమిటేషన్ ప్రక్రియ 1952లో జరిగింది. తద్వారా అప్పటి జనాభా ఆధారంగా లోక్‌సభకు 494 నియోజకవర్గాలుగా నిర్ణయించారు. 1963లో రెండో డీలిమిటేషన్ కమిషన్ ఈ సంఖ్యను 522కు పెంచింది. 1973లో లోక్‌సభ సీట్లు 543కు పెరిగాయి. ఆ తర్వాత జనాభా పెరిగినా మళ్లీ డీలిమిటేషన్‌లో భాగంగా సీట్లను పెంచలేదు. కారణం 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాలపాటు నిలిపేసింది. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేలా రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో వాజ్‌పేయీ సర్కారు అదే కారణం చెబుతూ మరో పాతికేళ్ల దాకా అంటే 2026 దాకా డీలిమిటేషన్‌కు దారులు మూసింది. మధ్యలో 2002లో జస్టిస్ కుల్‌దీప్ సింగ్ సారథ్యంలోని డీలిమిటేషన్ కమిష్‌ను ఏర్పాటు చేసినా అది కేవలం నియోజకవర్గాల పరిధులను మార్చడానికే పరిమితమైంది. సంఖ్యను పెంచలేదు.
కొవిడ్ దెబ్బతో
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రాల్లో ఉన్న చట్టసభల సీట్ల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినవే. సాధారణంగానైతే 2026లో గడువు ముగియగానే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టే వీలుండేది. కానీ పదేళ్లకోసారి చేపట్టే జన గణన 2021లో కొవిడ్ కారణంగా చేపట్టలేదు. 2024 ఎన్నికల తర్వాత జన గణన మొదలవుతుందని అంటున్నారు. ఇదంతా పూర్తయి, నివేదికలు సిద్ధమవడానికి మూడు నాలుగేళ్లు పట్టొచ్చని అంచనా. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
పెరిగేనా? పేచీనా?
అంతా సవ్యంగా సాగితే 2029 తర్వాతే కొత్త నియోజకవర్గాలతోపాటు మహిళలకు రిజర్వేషన్లు అమల్లోకి రావొచ్చు. మారిన జనాభా ప్రకారం.. పార్లమెంటులో లోక్‌సభ సీట్లు 888 దాకా... రాజ్యసభ సీట్లు ప్రస్తుత 245 నుంచి 384కు పెరుగుతాయని అంచనా. ఇక్కడే గొడవ తలెత్తే అవకాశముంది. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రస్తుతమున్న లోక్‌సభ సీట్లు 80 నుంచి 143కు, బిహార్ సీట్లు 40 నుంచి 79కి పెరగొచ్చు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో సీట్లు 17 దాకా తగ్గొచ్చు. తద్వారా హిందీ రాష్ట్రాల ప్రాబల్యం పార్లమెంటులో ఎక్కువ అవుతుంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాల అధినేతలు కేంద్రంవద్ద ఇప్పటికే తమ అభ్యంతరాలను తెలియజేశారు. జనాభా నియంత్రణను పాటించి, అభివృద్ధి చెందుతున్నందుకు తమకు అన్యాయం జరుగుతుందని, దీనిని అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌లో ఏం చేస్తారనేది ఆసక్తికరం.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Uttarakhand Tunnel: డ్రిల్లింగ్ పూర్తి.. ఏ క్షణమైనా కూలీలు బయటకు..
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. సొరంగం వద్ద తవ్వకాలు పూర్తయ్యాయి. -
Madras HC: కలెక్టర్లకు ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం: మద్రాసు హైకోర్టు
తమిళనాడులోని అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద ఐదుగురు జిల్లా కలెక్టర్లకు ఈడీ జారీ చేసిన నోటీసులపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. -
Kota: నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ జరిగిన బలవన్మరణాల సంఖ్య 28కి చేరుకుంది. -
Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్‌చాట్.. అదెలా సాధ్యమంటే..?
కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’(Emergency) చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలు వైరల్‌గా మారాయి. -
Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. నేలకు సమాంతరంగా చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్‌లో ఇంకా 10 మీటర్ల తవ్వకాలు పూర్తిచేస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. -
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. -
రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె
హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్‌పుర్‌కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. -
రన్‌వేపై బారాత్.. విమానంలో వివాహం
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. -
మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం
ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు అధికారం ఈసీకి ఉండాలి
చట్టాలను, నమోదు నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘాని(ఈసీ)కి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన వాదనల్లో పిటిషనర్ గట్టిగా కోరారు. -
గుజరాత్లో అకాల వర్షాలు
గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు. -
36 మీటర్లు పూర్తయిన తవ్వకం
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది. -
మార్చి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఖరారు
అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
మహాత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడైతే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అభివర్ణించారు. -
Jagdeep Dhankar: గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్
ప్రముఖ జైన మత గురువు, ఆధ్యాత్మిక వేత్త శ్రీమద్ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: డ్రిల్లింగ్ పూర్తి.. ఏ క్షణమైనా కూలీలు బయటకు..
-
Supreme court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
-
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు