25 నుంచి రుతుపవనాల తిరోగమనం: ఐఎండీ

నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 25 నుంచి వాయవ్య దిశగా మొదలు కావొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది.

Published : 23 Sep 2023 04:35 IST

దిల్లీ: నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 25 నుంచి వాయవ్య దిశగా మొదలు కావొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. సాధారణంగా జూన్‌ 1న కేరళలో ప్రవేశించే ఈ రుతుపవనాలు జులై 18 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించి వర్షపాతాన్ని కలగజేస్తాయి. అవి సెప్టెంబరు 17 నుంచి మొదలై అక్టోబరు 15 నాటికి పూర్తిగా వాయవ్య దిశ నుంచి నిష్క్రమిస్తాయి. ప్రస్తుతం అందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొని ఉన్నందున ఈ నెల 25 నుంచి పశ్చిమ రాజస్థాన్‌ ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా నిష్క్రమిస్తుండటం వరుసగా ఇది 13వ సారి. ఇలా జరిగితే దేశంలో వర్షాకాలం దీర్ఘకాలం కొనసాగినట్లు భావిస్తారు. ఈ ఏడాది నైరుతి కాలంలో ఇప్పటి వరకూ దేశంలో 780.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 832.4 మి.మీ కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని