జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ నేడు

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని జమిలి ఎన్నికల ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం శనివారం దిల్లీలో జరగనుంది.

Published : 23 Sep 2023 04:35 IST

దిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని జమిలి ఎన్నికల ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం శనివారం దిల్లీలో జరగనుంది. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే విషయమై సంబంధిత పక్షాలన్నిటితో సంప్రదింపుల నిర్వహణకు అవసరమైన మార్గసూచీని రూపొందించుకోవడంపై కమిటీ చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న ఎనిమిది మంది సభ్యులతో ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఈ కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు నిరాకరిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాజ్యసభలో మాజీ విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఫైనాన్స్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ సి.కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ సీవీసీ సంజయ్‌ కొఠారి ప్రస్తుతం కమిటీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని