లేచి నిలబడి భక్తులను దీవిస్తున్న వినాయకుడు!

గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా కోల్‌కతాలో వినూత్నంగా ఏర్పాటుచేసిన పూజామండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Published : 23 Sep 2023 04:35 IST

గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా కోల్‌కతాలో వినూత్నంగా ఏర్పాటుచేసిన పూజామండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరంలో ఓచోట సెన్సర్‌ సహాయంతో ప్రత్యేకంగా  రూపొందించిన గణేశుని విగ్రహం భక్తులు పాదాలను తాకి నమస్కరించిన వెంటనే లేచి నిలబడి ఆశీర్వాదం అందిస్తోంది. దీంతో ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. మండపంలో గణేశుడితోపాటు లోకనాథ్‌, మహాదేవ్‌, కాళీమాత, చైతన్య విగ్రహాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంగణానికి పాంచ్‌ధామ్‌ అని పేరు పెట్టినట్లు మండప నిర్వాహకుడు బిప్లబ్‌ దేవ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని