సూరత్‌లో రూ.600 కోట్ల వజ్ర గణపతి

గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారి కనుభాయ్‌ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు.

Published : 23 Sep 2023 05:35 IST

గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారి కనుభాయ్‌ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు. ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు. పరిమాణంలో ఇది కోహినూర్‌ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు. ఈ వజ్రం ధర గురించి కనుభాయ్‌ వెల్లడించకపోయినా.. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పదిహేనేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్‌ అక్కడి నుంచి ముడి వజ్రాలను భారత్‌కు తీసుకొచ్చారు. ‘‘అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు మా తండ్రికి కల వచ్చింది. పరిశీలిస్తే.. ఒక వజ్రం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి ఆకారంలో ఉంది. అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి మా కుటుంబం పూజలు చేస్తోంది’’ అని కనుభాయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని