గృహనిర్బంధం నుంచి మీర్వాయిజ్‌ విడుదల

నాలుగేళ్లుగా గృహ నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ హురియత్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ శుక్రవారం విడుదలయ్యారు.

Published : 23 Sep 2023 04:35 IST

శ్రీనగర్‌: నాలుగేళ్లుగా గృహ నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ హురియత్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ శుక్రవారం విడుదలయ్యారు.  అనంతరం ఇక్కడి చారిత్రక జామియా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సమయంలో మీర్వాయిజ్‌ను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ మీర్వాయిజ్‌ జమ్మూకశ్మీర్‌ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అధికారులు నాలుగు వారాల్లోగా స్పందన తెలపాలంటూ హైకోర్టు ఈ నెల 15న ఆదేశించింది. ఈ నేపథ్యంలో మీర్వాయిజ్‌ను విడుదల చేయడం గమనార్హం. ఈ నిర్ణయాన్ని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీతోపాటు ఇతర పార్టీలు స్వాగతించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని