అంబానీలను భయపెట్టేందుకే.. ఇంటి ముందు పేలుడు పదార్థాల ఎత్తుగడ

ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబమైన అంబానీలను భయపెట్టే ఉద్దేశంతోనే వారి ఇంటి ముందు మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే పేలుడు పదార్థాలు పెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో తేలింది.

Published : 23 Sep 2023 05:17 IST

ఎన్‌ఐఏ విచారణలో వెల్లడి

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబమైన అంబానీలను భయపెట్టే ఉద్దేశంతోనే వారి ఇంటి ముందు మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే పేలుడు పదార్థాలు పెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో తేలింది. రెండేళ్ల క్రితం.. ముంబయిలోని ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కనిపించిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సచిన్‌ వాజేకు బెయిలు ఇచ్చేందుకు ఎన్‌ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఏఎం పాటిల్‌ నిరాకరిస్తూ సెప్టెంబర్‌ 16న ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. అంబానీ కుటుంబికులను భయభ్రాంతులకు గురిచేసేందుకు యాంటిలియా (అంబానీ ఇల్లు) సమీపంలో జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టిన మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే.. వాటిని డిటోనేటర్‌కు అమర్చలేదని ఎన్‌ఐఏ తెలిపింది. 2021 ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల  వాహనం ఆగిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు సీసీటీవీ రికార్డుల్లో చూసి ఆ వాహనాన్ని నిలిపిన వ్యక్తి పీపీఈ కిట్‌ వేసుకున్నట్లుగా గుర్తించారు. కేసు దర్యాప్తులో.. ఆ వ్యక్తి మాజీ పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే అని ఎన్‌ఐఏ తేల్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు