యుద్ధాన్ని ఆపడంలో భద్రతా మండలి వైఫల్యం: భారత్‌

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాన్ని ఆపడంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎందుకు విఫలమైందో అంతర్జాతీయ సమాజం నిలదీయాలని భారత్‌ డిమాండ్‌ చేసింది.

Published : 23 Sep 2023 05:17 IST

ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాన్ని ఆపడంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎందుకు విఫలమైందో అంతర్జాతీయ సమాజం నిలదీయాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. ప్రపంచంలో శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత భద్రతా మండలిపై ఉందని గుర్తుచేసింది. ఉక్రెయిన్‌ సమస్యపై భద్రతా మండలి బహిరంగ చర్చలో పాల్గొన్న భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సంజయ్‌ వర్మ ఈ సందర్భంగా రెండు ప్రశ్నలను లేవనెత్తారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి పరిష్కారం కనుచూపు మేరలో ఉందా? పరిష్కారం కనబడటం లేదంటే భద్రతా మండలి విధి నిర్వహణలో విఫలమైనట్లు కాదా? అంటూ సంజయ్‌ ప్రశ్నించారు.మండలిని సంస్కరించనంతవరకు దానిపై పూర్తిస్థాయి విశ్వసనీయత ఏర్పడదని వర్మ ఉద్ఘాటించారు. మండలిలో భారత్‌, బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీలు శాశ్వత సభ్యత్వం కోరుతున్నాయి. ఆ మేరకు సంస్కరణలు తీసుకురావడం తప్పనిసరని డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని