మృతదేహాల నిర్వహణకు ప్రొటోకాల్‌ రూపొందించడంపై అభిప్రాయం తెలపండి: సుప్రీం

విపత్తులు, విపత్తుయేతర సమయాల్లో మృతదేహాల నిర్వహణకు అనుసరణీయ ప్రామాణిక నిబంధనలు(ప్రొటోకాల్‌) రూపొందించాలనే అభ్యర్థనపై స్పందనను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated : 23 Sep 2023 05:27 IST

దిల్లీ: విపత్తులు, విపత్తుయేతర సమయాల్లో మృతదేహాల నిర్వహణకు అనుసరణీయ ప్రామాణిక నిబంధనలు(ప్రొటోకాల్‌) రూపొందించాలనే అభ్యర్థనపై స్పందనను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు మూడు వారాల గడువునిచ్చింది. కొవిడ్‌ సమయంలో మరణించిన తన తల్లి ముఖాన్ని చూడలేకపోవడంతో పాటు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోయినట్లు ఒక పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆమె కొవిడ్‌ వల్ల చనిపోలేదన్నారు. తన తల్లి పార్ధీవదేహానికి బదులు వేరొకరి మృతదేహాన్ని అప్పగించారని ఆరోపించారు. కరోనా వ్యాప్తి సమయంలో ఆసుపత్రులలోని మార్చురీలలో, స్మశాన వాటికలలో మృతదేహాల పట్ల ప్రామాణికమైన విధానాలను, గౌరవనీయపద్ధతులను పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని సుమోటోగా సుప్రీంకోర్టు చేపట్టగా పిటిషనర్‌ ఇంప్లీడయ్యారు. ఈ కేసులో శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం....మృతదేహాల అప్పగింత, వాటి అంత్యక్రియల సంబంధిత అంశాల్లో పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలు రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. కేసు తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది.

వైవాహిక అత్యాచారాల పిటిషన్లపై అక్టోబరులో విచారణ

వైవాహిక అత్యాచార అంశంపై దాఖలైన పిటిషన్లను అక్టోబరు నెలలో విచారిస్తామని శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. మైనర్‌ కాని భార్యను శృంగారానికి బలవంతం చేసే భర్తకు అత్యాచారం నేరం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని ఈ పిటిషన్లు సవాల్‌ చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని