సాంకేతిక అంశాలతో దోషులు తప్పించుకుంటున్నారు

దేశవ్యాప్తంగా పోలీసులు అనుసరిస్తున్న దర్యాప్తు విధానాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Updated : 23 Sep 2023 05:49 IST

 పోలీసుల దర్యాప్తు విధానాల్లోనే లోపం ఉంది: సుప్రీంకోర్టు

దిల్లీ: దేశవ్యాప్తంగా పోలీసులు అనుసరిస్తున్న దర్యాప్తు విధానాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో సాంకేతిక కారణాలతోనే దోషులు తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దర్యాప్తు ఎలా చేయాలన్న అంశంపై విచారణాధికారులకు ఓ స్థిరమైన, విశ్వసనీయమైన నియమావళిని రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొంది. ఓ కేసులో మరణశిక్ష, యావజ్జీవం పడిన నిందితులను విడుదల చేస్తూ.. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సాంకేతిక కారణాలతో దోషులు తప్పించుకోకూడదని, కానీ చాలా కేసుల్లో ఇదే జరుగుతోందని తెలిపింది. మరో కేసులో దీర్ఘకాలం జైలుశిక్ష అనుభవించిన ఖైదీలకు ముందస్తు విడుదల అవకాశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సత్ప్రవర్తన గల ఖైదీలకు క్షమాభిక్షను దూరం చేయడం సరికాదని పేర్కొంది. 26 ఏళ్లుగా కస్టడీలో ఉన్న ఓ 67 ఏళ్ల ఖైదీ విడుదలకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

మణిపుర్‌ ప్రొఫెసర్‌కు అరెస్టు నుంచి రక్షణ

విద్వేష ప్రసంగం అభియోగాలు ఎదుర్కొంటున్న మణిపుర్‌ ప్రొఫెసర్‌ హెన్‌మిన్‌లున్‌కు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అరెస్టు సహా ఇతర కఠిన చర్యలను మరో మూడు వారాలు పాటు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని