50 కిలోల తాబేలుతో గ్రామస్థుల పరార్‌..

ఆలయ చెరువులో ఏళ్ల నాటి తాబేలు లభ్యమైంది. 50 కిలోలకుపైగా బరువు ఉన్న ఆ తాబేలును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇంతలో కొందరు గ్రామస్థులు దానిని తీసుకుని పరారయ్యారు.

Updated : 27 Sep 2023 06:03 IST

లయ చెరువులో ఏళ్ల నాటి తాబేలు లభ్యమైంది. 50 కిలోలకుపైగా బరువు ఉన్న ఆ తాబేలును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇంతలో కొందరు గ్రామస్థులు దానిని తీసుకుని పరారయ్యారు. బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని బ్రహ్మపుర్‌లో ఉన్న బాబా బ్రహ్మేశ్వరనాథ్‌ ఆలయ సుందరీకరణ పనులు గత ఆరు నెలలుగా జరుగుతున్నాయి. ఇటీవలే ఆలయ చెరువులోని పాత నీటిని తోడి కొత్త నీటిని నింపే ప్రక్రియను ప్రారంభించారు. ఆ సమయంలో భారీ తాబేలుతో పాటు చేపలు లభ్యమయ్యాయి. అక్కడికి చేరుకున్న పలువురు గ్రామస్థులు.. తువ్వాలులో భారీ తాబేలును వేసుకుని పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో తాబేలు కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు