2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్‌ క్యూబ్‌లు చెప్పేస్తున్న బాలిక..

పంజాబ్‌లోని బఠిండాకు చెందిన ఓ విద్యార్థిని.. ఒకటి నుంచి 50 మ్యాథ్స్‌ క్యూబ్‌లను రెండు నిమిషాల్లోనే చెప్పేస్తోంది. తన అరుదైన ప్రతిభతో ఇప్పటికే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన బాలిక..

Published : 27 Sep 2023 07:10 IST

పంజాబ్‌లోని బఠిండాకు చెందిన ఓ విద్యార్థిని.. ఒకటి నుంచి 50 మ్యాథ్స్‌ క్యూబ్‌లను రెండు నిమిషాల్లోనే చెప్పేస్తోంది. తన అరుదైన ప్రతిభతో ఇప్పటికే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన బాలిక.. తాజాగా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ తన పేరును లిఖించుకుంది. బఠిండాకు చెందిన 15 ఏళ్ల బాలిక అపేక్ష.. స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి గణిత శాస్త్రం అంటే ఇష్టపడే అపేక్ష.. అందరిలో కాస్త ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా సాధన చేసి క్యూబ్‌లను సెకన్లలోనే పరిష్కరిస్తోంది. ఒకటి నుంచి 50 క్యూబ్‌లను  రెండు నిమిషాల్లోనే చెప్పేస్తున్న ఆ బాలిక.. 2022లో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని