Chandrayaan-3: ల్యాండర్‌, రోవర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు

చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.

Updated : 27 Sep 2023 08:32 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడంతో శాస్త్రవేత్తలు వాటితో అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సానుకూల ఫలితాలు రాలేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమయం గడిచేకొద్ది అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు. ఇస్రో మాజీ అధిపతి ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ల్యాండర్‌, రోవర్‌లతో ఇక అనుసంధానం కాలేకపోయినప్పటికీ ఈ మిషన్‌ ఓ అఖండ విజయమని అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని