బాంబులా పేలిన ఫోను.. కిటికీలు, సామాన్లు ధ్వంసం

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఛార్జింగు పెట్టిన మొబైల్‌ ఫోను ఒక్కసారిగా పేలడంతో ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి.

Published : 28 Sep 2023 06:02 IST

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఛార్జింగు పెట్టిన మొబైల్‌ ఫోను ఒక్కసారిగా పేలడంతో ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా దెబ్బతినడం గమనార్హం. ఈ ఘటన జరిగిన ఇంట్లో నివాసముంటున్న ముగ్గురికి తీవ్రగాయాలు కూడా అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నాసిక్‌ ప్రతాప్‌నగర్‌లోని సిడ్కో ప్రాంతంలో తుషార్‌ జగ్‌తాప్‌, శోభా జగ్‌తాప్‌, బాలకృష్ణ సుతార్‌ కలిసి నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఈ ముగ్గురిలో ఒకరు తమ మొబైల్‌ ఫోను ఛార్జింగు పెట్టారు. ఉన్నట్టుండి భారీశబ్దంతో ఫోను పేలింది. స్థానికులు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని