పసిప్రాణాన్ని కాపాడిన వృద్ధులు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని చేత్‌గంజ్ పోలీస్‌స్టేషను పరిధిలో ముగ్గురు వృద్ధుల చొరవ ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని చేత్‌గంజ్ పోలీస్‌స్టేషను పరిధిలో ముగ్గురు వృద్ధుల చొరవ ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. మంగళవారం ఆ వీధిలో భారీవర్షం కురిసింది. కాస్త తెరిపి ఇవ్వగానే స్థానికుడైన జితేంద్ర కుమారుడు కార్తీక్ (10) ఆడుకోడానికి బయటకు వచ్చాడు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తుతీగలు రహదారిపై స్తంభానికి సమీపంగా నిలిచిన వర్షపునీటిలో పడ్డాయి. ఆ మడుగులో అడుగుపెట్టిన కార్తీక్ షాక్‌కు గురై అక్కడే పడిపోయి విలవిలలాడాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న ముగ్గురు వృద్ధులు బాలుణ్ని గమనించారు. అందులో ఒకరు పరుగున వెళ్లి చిన్నారిని పైకి లేపేందుకు ప్రయత్నించారు. విద్యుత్తు ప్రసరిస్తున్నట్లు గ్రహించాక వెనక్కి తగ్గారు. మిగతా ఇద్దరు వృద్ధులు ఓ కర్రను తీసుకొచ్చి.. దాన్ని నెమ్మదిగా బాలుడి చేతికి అందించారు. చిన్నారి కర్రను పట్టుకోగానే అతణ్ని బురద నీటిలో నుంచి పక్కకు లాగారు. సీసీటీవీలో రికార్డయిన ఈ ఘటన వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
అంబేడ్కర్‌కు ప్రధాని ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షిప్త వార్తలు
చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తిరిగి భూకక్ష్యలోకి విజయవంతంగా తీసుకువచ్చిన ఇస్రోకు అభినందనలు. -
వరద నుంచి తేరుకోని చెన్నై
మిగ్జాం తుపాను శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సమస్య ఉన్న చోట నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, గ్రేటర్ కార్పొరేషన్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
Ratan Tata: రిస్క్‌లేని పెట్టుబడి అంటూ.. రతన్ టాటా నకిలీ ఇంటర్వ్యూ ఇన్‌స్టాలో పోస్టు
రతన్ టాటా మాట్లాడినట్లు ఓ నకిలీ ఇంటర్వ్యూ ఇన్‌స్టాగ్రామ్‌లో వెలుగుచూసింది.