వేలానికి మోదీ బహుమతులు

ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన 912 బహుమతులు, జ్ఞాపికలను సోమవారం నుంచి వేలానికి పెట్టారు. ఈ ప్రక్రియ ఈ నెల 31 వరకూ సాగనుంది.

Published : 03 Oct 2023 03:22 IST

దిల్లీ: ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన 912 బహుమతులు, జ్ఞాపికలను సోమవారం నుంచి వేలానికి పెట్టారు. ఈ ప్రక్రియ ఈ నెల 31 వరకూ సాగనుంది. దీని ద్వారా వచ్చిన సొమ్మును గంగా నది శుద్ధి కార్యక్రమం ‘నమామి గంగే ప్రాజెక్టు’కు అందిస్తారు. వేలం ప్రక్రియ వివరాలను సోమవారం కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి విలేకరులకు వివరించారు. ఈ-వేలంలో పౌరులు పాల్గొని ‘నమామి గంగే ప్రాజెక్టు’కు తమ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆసక్తి కలవారు https://pmmementos.gov.in/  ను సందర్శించి వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు. గుజరాత్‌లోని మొధేరాలోని సూర్య దేవాలయం, చిత్తోడ్‌గఢ్‌ విజయ స్తంభం నమూనాలు, వారణాసి ఘాట్‌ పెయింటింగ్‌ వంటివి ఈ వేలంలో అమ్మకానికి ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని