గర్భిణిని భుజాలపై మోస్తూ 4 కి.మీ. నడక

గిరిజన గర్భిణిని భుజాలపై మోస్తూ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 03 Oct 2023 03:22 IST

మార్గమధ్యలోనే ప్రసవం

గిరిజన గర్భిణిని భుజాలపై మోస్తూ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శహర్‌పుర్‌ తాలుకాలోని పటికచపడ గ్రామానికి చెందిన గర్భిణికి ఆదివారం పురిటినొప్పులు మొదలయ్యాయి. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల అంబులెన్స్‌ సహా ఎలాంటి వాహనం గ్రామానికి వచ్చేందుకు వీలు లేదు. దీంతో గ్రామస్థులు ఆమెను భుజాలపై మోస్తూ నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో ఆమెకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. స్థానిక ఆశా కార్యకర్త.. గ్రామస్థుల సాయంతో ఆ మహిళకు ప్రసవం చేసింది. అనంతరం ఓ ప్రైవేట్‌ వాహనంలో తల్లీబిడ్డలను కాసర ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే.. గతంలో ఠాణె ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న సమయంలో తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, అయినా రోడ్డు సౌకర్యం సమకూరలేదని గ్రామస్థులు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని