భూతాప నిరోధానికి సంపన్న దేశాలే సారథ్యం వహించాలి

వాతావరణ మార్పులకు కారణమైన కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరించినది తామేనని సంపన్న దేశాలు ఒప్పుకొని భూతాప నిరోధానికి సారథ్యం వహించాలనీ, లేదంటే తమ వైఫల్యాన్ని అంగీకరించాలని బేసిక్‌ గ్రూపు దేశాలు డిమాండ్‌ చేశాయి.

Published : 03 Oct 2023 03:22 IST

బేసిక్‌ గ్రూపు దేశాల డిమాండ్‌

దిల్లీ: వాతావరణ మార్పులకు కారణమైన కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరించినది తామేనని సంపన్న దేశాలు ఒప్పుకొని భూతాప నిరోధానికి సారథ్యం వహించాలనీ, లేదంటే తమ వైఫల్యాన్ని అంగీకరించాలని బేసిక్‌ గ్రూపు దేశాలు డిమాండ్‌ చేశాయి. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, భారత్‌, చైనాలను కలిపి ‘బేసిక్‌’గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ జనాభాలో సంపన్న దేశాల వాటా 16 శాతమే అయినా, 1850-2019 మధ్యకాలంలో 57 శాతం బొగ్గుపులుసు వాయు ఉద్గారాలకు ఆ దేశాలే కారణమయ్యాయని వాతావరణ మార్పులపై అంతర్‌ ప్రభుత్వ బృందం (ఐపీసీసీ) ఆరవ మూల్యాంకన నివేదిక పేర్కొంది. అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు తమ ఉత్పత్తి, వినియోగ రీతులను మార్చుకుని 2050 కన్నా ముందే కర్బన ఉద్గారాల తటస్థతను సాధించాలనీ, వాతావరణ మార్పుల నిరోధానికి వర్ధమాన దేశాలకు లక్షల కోట్ల డాలర్ల నిధులను అందించాలనీ బేసిక్‌ డిమాండ్‌ చేసింది. ఈ విధంగా ప్రపంచంలోని సంపన్న, వర్ధమాన దేశాలు తమ తాహతుకు తగినట్లు భూతాప నిరోధానికి కృషిచేయాలనీ, పారిస్‌ వాతావరణ సభ తీర్మానాలను నెరవేర్చాలనీ ప్రతిపాదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని