ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ప్రభావం తగ్గుముఖం

ఛత్తీస్‌గఢ్‌లో గత ఐదేళ్లలో వామపక్ష తీవ్రవాద ఘటనలు 52శాతం తగ్గాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.

Published : 03 Oct 2023 03:22 IST

గత ఐదేళ్లలో 52శాతం తగ్గిన ఘటనలు

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో గత ఐదేళ్లలో వామపక్ష తీవ్రవాద ఘటనలు 52శాతం తగ్గాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. 589 గ్రామాలు, 5.74 లక్షల మంది ప్రజలు నక్సల్స్‌ ప్రభావ హింస నుంచి విముక్తి పొందినట్లు తెలిపింది. హింసాత్మక పరిస్థితుల కారణంగా 15 ఏళ్లుగా మూతపడిన 314 పాఠశాలలు తిరిగి తెరుచుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 2019తో పోలిస్తే మహిళలపై నేరాలు 40 శాతం తగ్గినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని