ఏడుగురి అరెస్టుకు నిరసనగా బంద్‌

మణిపుర్‌లో గిరిజనులు అధికంగా ఉండే చురాచాంద్‌పుర్‌ జిల్లాలో సోమవారం పూర్తి బంద్‌ కారణంగా సాధారణ జనజీవనం స్తంభించింది.

Published : 03 Oct 2023 03:22 IST

మణిపుర్‌లోని చురాచాంద్‌పుర్‌లో స్తంభించిన జనజీవనం

ఇంఫాల్‌: మణిపుర్‌లో గిరిజనులు అధికంగా ఉండే చురాచాంద్‌పుర్‌ జిల్లాలో సోమవారం పూర్తి బంద్‌ కారణంగా సాధారణ జనజీవనం స్తంభించింది. ఇటీవల సంచలనం సృష్టించిన ఇద్దరు కళాశాల విద్యార్థుల హత్యకు సంబంధించి ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు సహా ఏడుగురిని ఎన్‌ఐఏ, సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కుకి తెగ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. మార్కెట్లు, వ్యాపార సంస్థలను మూసివేశారు. వాహనాలు రోడ్డెక్కలేదు. అరెస్టు చేసిన వారిని 48 గంటల్లో విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని