స్వర్ణదేవాలయంలో రాహుల్‌ ప్రార్థనలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం సిక్కుల పవిత్ర స్థలమైన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.

Published : 03 Oct 2023 03:22 IST

లంగర్‌లో పాత్రలు కడిగిన కాంగ్రెస్‌ నేత

అమృత్‌సర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం సిక్కుల పవిత్ర స్థలమైన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. గర్భగుడిలో ప్రార్థనలు జరిపారు. తలకు నీలిరంగు వస్త్రం ధరించిన రాహుల్‌.. అకాల్‌ తఖ్త్‌కు కూడా వెళ్లారు. గుర్బానీ కీర్తనలు విన్నారు. వంటశాలలో భక్తులతో  కలిసి పాత్రలను శుభ్రం చేశారు. మంగళవారం ఉదయం నిర్వహించే పాలకీ సేవలోనూ పాల్గొంటారు. ఇది రాహుల్‌ వ్యక్తిగత ఆధ్యాత్మిక పర్యటన అని, దీన్ని గౌరవించి కార్యకర్తలెవరూ మందిరానికి రావొద్దని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పేర్కొంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌సింగ్‌ ఖైరాను డ్రగ్స్‌ కేసులో ఆప్‌ ప్రభుత్వం అరెస్టు చేసిన నేపథ్యంలో రాహుల్‌ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని