విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నం

నాగపూర్‌ నుంచి బెంగళూరుకు వచ్చే విమానంలో అత్యవసర ద్వారాన్ని బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించిన స్వప్నిల్‌ హోలే అనే ప్రయాణికుడిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 03 Oct 2023 04:26 IST

బెంగళూరులో ప్రయాణికుడి అరెస్టు

బెంగళూరు(గ్రామీణం), న్యూస్‌టుడే: నాగపూర్‌ నుంచి బెంగళూరుకు వచ్చే విమానంలో అత్యవసర ద్వారాన్ని బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించిన స్వప్నిల్‌ హోలే అనే ప్రయాణికుడిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. నాగపూర్‌లో శనివారం రాత్రి 10 గంటలకు ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో స్వప్నిల్‌ విమానం తలుపును తెరిచేందుకు యత్నించాడని సోమవారం పోలీసులు తెలిపారు. విమానయాన సంస్థ సిబ్బంది, ప్రయాణికులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బెంగళూరుకు ఆ రోజు రాత్రి విమానం చేరుకున్న తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. అతని వివరణ తీసుకున్న తర్వాత స్టేషన్‌ బెయిలుపై పోలీసులు విడిచి పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని