పైలట్లు పెర్‌ఫ్యూమ్‌లు వాడొద్దు

పైలట్లు సహా విమానయాన సిబ్బంది సువాసనలు వెదజల్లే పెర్‌ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లు వినియోగించొద్దని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఓ ముసాయిదాను విడుదల చేసింది.

Published : 03 Oct 2023 04:26 IST

డీజీసీఏ ముసాయిదా విడుదల

దిల్లీ: పైలట్లు సహా విమానయాన సిబ్బంది సువాసనలు వెదజల్లే పెర్‌ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లు వినియోగించొద్దని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఓ ముసాయిదాను విడుదల చేసింది. విమాన సర్వీసుల్లో పాల్గొనే సిబ్బందికి తరచూ శ్వాస పరీక్షలు(బ్రీత్‌ ఎనలైజర్‌) నిర్వహిస్తుంటారు. పెర్‌ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లలో ఆల్కహాల్‌ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ భావిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘విమానయాన సిబ్బంది ఎవరూ ఏ ఔషధాన్ని తీసుకోకూడదు. మౌత్‌వాష్‌, టూత్‌జెల్‌, పెర్‌ఫ్యూమ్‌లను వినియోగించొద్దు. ఆల్కహాల్‌తో తయారైన ఉత్పత్తుల కారణంగా బ్రీత్‌ ఎనలైజర్లలో పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉంది. గగనయాన కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులెవరైనా ఔషధాలు తీసుకునే ముందు కంపెనీ వైద్యుడిని సంప్రదించాలి’అని తాజాగా రూపొందించిన ముసాయిదాలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని