మెరుగుపడని ప్రజా మరుగుదొడ్లు

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత ఏమీ మెరుగుపడలేదని దేశంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు.

Published : 03 Oct 2023 04:28 IST

దేశంలో 52% మంది అభిప్రాయమిదే..

దిల్లీ: స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత ఏమీ మెరుగుపడలేదని దేశంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి మహా నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే సామాజిక మాధ్యమ వేదిక దేశవ్యాప్తంగా 341 జిల్లాల్లో ఈ సర్వేను చేపట్టింది. 39 వేలకుపైగా మంది అభిప్రాయాలను తెలుసుకుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం తమ నగరం/జిల్లాలో ప్రజా మరుగుదొడ్లు మెరుగయ్యాయని, లభ్యత పెరిగిందని 42% మంది పేర్కొన్నారు. అలాంటి మెరుగుదల ఏదీ లేదని ఏకంగా 52% అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని